హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో తమకు 30% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ మహిళా న్యాయవాదులు శుక్రవారం హైకోర్టులోని బార్ కౌన్సిల్ గేట్ వద్ద వద్ద ప్లకార్డులతో ఆందోళనకు దిగారు. అనంతరం బార్ కౌన్సిల్ చైర్మన్, కార్యదర్శిని కలిశారు.
మహిళా న్యాయవాదులు శారద గుండ్రాతి, ప్రేమలత, రజిత, సుమిత్రాదేవి, చందన, జయశ్రీ, ఊర్మిళ, శ్రీలత, శ్వేత తదితరులు పాల్గొన్నారు. కాగా, మహిళా న్యాయవాదుల ఆందోళనకు హెచ్‌సీఏఏ అధ్యక్షుడు జగన్, బీసీఐ సభ్యుడు విష్ణువర్ధన్‌రెడ్డి మద్దతు తెలిపారు.