హైదరాబాద్, మార్చి 11(నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయింది. బండి సంజయ్ చేసిన అనుచిత, అవమానకర వ్యాఖ్యలను కమిషన్ సుమోటోగా స్వీకరించింది.
మహిళల గౌరవాన్ని కించపరిచే విధంగా బండి వ్యాఖ్యలు ఉన్నాయని కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన మహిళా కమిషన్.. బండిని వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించాలని నిర్ణయించినట్టు తెలిసింది.