వనస్థలిపురం, నవంబర్ 18: ప్రేమోన్మాది చేతిలో 18 కత్తిపోట్లకు గురైన యువతి మృత్యువును జయించింది. సాధారణంగా రెండు మూడు కత్తిపోట్లకు గురైతేనే కోలుకోవడం కష్టం. తీవ్రంగా గాయపడిన బాధితురాలు వారం రోజులు చికిత్సపొంది గురువారం దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యింది. వారం క్రితం హస్తినాపురంలో ప్రేమోన్మాది చేతిలో బాధితురాలు కత్తిపోట్లకు గురైన ఘటన నగరంలో సంచలనం సృష్టంచిన విషయం విదితమే. బాధితురాలిని కుటుంబ సభ్యులు హస్తినాపురంలోని ఓ హాస్పిటల్లో చేర్పించారు. వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎలాంటి శస్త్రచికిత్స లేకుండా గాయాలకు వైద్యం చేశారు. బాధితురాలు పూర్తిగా కొలుకోవడంతో దవాఖాన నుంచి డిశ్చార్జి చేశారు.