నమస్తే, నెట్వర్క్ అక్టోబర్ 25 : న్యూడ్కాల్ చేయాలంటూ ఓ మహిళను ముగ్గురు పోకిరీలు వేధించిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. ఎర్రవల్లి మండలంలోని ఓ మహిళకు అలంపూర్ మండలానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల న్యూడ్కాల్ చేసి రికార్డు చేశాడు.
ఆ వీడియోను ఇద్దరు స్నేహితులకు షేర్ చేశాడు. దీంతో ఆ ముగ్గురు కలిసి సదరు మహిళకు ఫోన్ చేసి న్యూడ్కాల్ చేయాలని బెదిరింపులకు గురిచేస్తూ బ్లాక్ మెయిల్ చేశారు. తమ కోరికలు తీర్చకుంటే, న్యూడ్కాల్ వీడియోలు వైరల్ చేస్తామని బెదిరించారు. దీంతో సదరు మహిళ కుటుంబసభ్యులతో కలిసి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది.