మణికొండ, సెప్టెంబర్ 24: ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి తనను పెళ్లి చేసుకుంటానని, శారీరకంగా వాడుకొని మోసం చేశాడని ఓ యువతి మంగళవారం హైదరాబాద్ నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. పేదలకు సేవ చేస్తున్నానంటూ యూట్యూబ్లో రీల్స్ చేస్తున్న హర్ష సాయి అనేక అరాచకాలకు పాల్పడ్డాడని ఆ యువతి ఆరోపిం చింది. కొ న్నాళ్లుగా ప్రేమాయణం నడిపినట్టుగా నటించిన హర్షసాయి తనను పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి పలుమార్లు శారీరకంగా వాడుకుని, ఇప్పు డు తెలియదన్నట్టుగా వ్యవహరిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకునేందుకంటూ తన నుంచి రూ.2 కోట్ల నగదు తీసుకున్నాడని, ఇందుకు ఆయన తండ్రి రాధాకృష్ణ కూడా కారణమని పేర్కొన్నది. కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు విచారణ చేపట్టి తదుపరి వివరాలు తెలుపుతామని చెప్పారు.