Missing | రామారెడ్డి, డిసెంబర్ 25 : కామారెడ్డి జిల్లా పోలీసుశాఖలో బుధవారం రాత్రి కలకలం రేగింది. భిక్కనూరు ఎస్సై సాయికుమార్, బీబీపేట మహి ళా కానిస్టేబుల్ శ్రుతి అదృశ్యం కావ డం, వారి సెల్ఫోన్లు అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు కట్టపై లభ్యం కావడంతో అక్క డ పోలీసులు గాలిస్తున్నారు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా సదాశివనగర్ మం డలం అడ్లూర్ ఎల్లారెడ్డి శివారులో ఉన్నట్టు గుర్తించి అక్కడకు వెళ్లారు. చెరువుకట్టపై ఎస్సై సొంత కారుతో పాటు ఫోన్లు, చెప్పులు లభ్యమయ్యా యి. వాటి ఆధారంగా ఎస్సై సాయికుమార్, కానిస్టేబుల్ శ్రుతితోపాటు బీబీపేట పీఏసీఎస్‌లో కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్‌గా గుర్తించారు. గజ ఈతగాళ్లు, ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్పీ సింధూశర్మ చెరువు వద్దకు చేరుకుని వివరాలు సేకరించారు. గాంధారి మండల కేంద్రానికి చెందిన శ్రుతి బీబీపేటలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నది. మెదక్ జిల్లాకు చెందిన సాయికుమార్ గతంలో బీబీపేట ఎస్సైగా పని చేసి, బదిలీపై భిక్కనూరుకు వచ్చారు. బీబీపేటలో పని చేసిన సమయంలో వీరికి పరిచయం ఏర్పడిందని భావిస్తున్నారు.