PM Modi | హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): మాదిగల విశ్వరూప సభలో ప్రధా ని మోదీకి ఊహించని షాక్ తగిలింది. ప్రధాని మోదీ మాట్లాడుతుండగా ఓ యువతి విద్యుత్తు లైట్ల స్టాండ్‌ను ఎక్కి మరీ నిరసన తెలిపింది. రోజుకో లైంగికదాడి జరుగుతున్నా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని, ఒకే మతాన్ని ఎం దుకు ప్రోత్సహిస్తున్నారని, కులాల పేరుతో ఎందుకు రెచ్చగొడుతున్నార ని, ఎస్సీ వర్గీకరణ చేయవద్దని నినదించింది. ఊహించని హఠాత్పరిణామానికి మోదీ ఖంగుతిన్నారు. కరెంట్ స్టాండ్ దిగాలని యువతిని కోరారు.