సిటీబ్యూరో, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ట్రై కమిషనరేట్ల పరిధిలో ఆదివారం మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేస్తున్నట్లు పోలీసు కమిషనర్లు ఆదేశాలు జారీ చేశారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
నిషేధిత సమయంలో మద్యం విక్రయాలకు పాల్పడితే సంబంధిత మద్య దుకాణం లేదా బార్ల లైసెన్స్లు రద్దు చేస్తామని హెచ్చరించారు. డ్రైడేలో మద్యం విక్రయాలు జరగకుండా ఆబ్కారీ శాఖ అధికారులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.