Liquor Shop Tenders | మద్యం దుకాణాలకు లక్కీ డ్రా పూర్తి.. 22 మంది విజేతలకు షాపులు కేటాయించిన ఎక్సైజ్ శాఖ
Liquor Shop Tenders | మద్యం దుకాణాలకు నిర్వహించిన లక్కీ డ్రా సజావుగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా మిగిలిపోయిన 22 మద్యం దుకాణాలకు కూడా మంగళవారం లక్కీడ్రా పూర్తి చేశారు. లక్కీ డ్రా లో విజేతలైన వారికి ఎక్సైజ్ అధికారులు షాపులు కేటాయించారు.
Liquor Shop Tenders | మద్యం దుకాణాలకు నిర్వహించిన లక్కీ డ్రా సజావుగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా మిగిలిపోయిన 22 మద్యం దుకాణాలకు కూడా మంగళవారం లక్కీడ్రా పూర్తి చేశారు. లక్కీ డ్రా లో విజేతలైన వారికి ఎక్సైజ్ అధికారులు షాపులు కేటాయించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,620 మద్యం దుకాణాల అనుమతుల కోసం ఇటీవల టెండర్లు ఆహ్వానించగా.. ఐదు ఏజెన్సీ జిల్లాల్లో 22 మద్యం దుకాణాలకు దరఖాస్తులు తక్కువగా వచ్చాయి. దీంతో ఆదిలాబాద్‌లో 9, ఆసిఫాబాద్‌లో 5, నిర్మల్‌లో 4, భూపాలపల్లిలో 3, కామారెడ్డిలో 1 దుకాణానికి ఎక్సైజ్ అధికారులు రీటెండర్ నోటిఫికేషన్ ఇచ్చారు. వాటికి కొత్తగా దరఖాస్తులు ఆహ్వానించారు. 22 మద్యం దుకాణాలకు పాతవి 128, కొత్తవి 291 కలుపుకొని మొత్తం 419 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. మంగళవారం ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో లక్కీ డ్రా నిర్వహించి విజేతలకు షాపులను కేటాయించారు. దీంతో రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాలకు లైసెన్సులు ప్రక్రియ పూర్తి అయిపోయింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

