ములుగు : ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి గెలుపు కోసం కృషి చేస్తానని గిరిజ సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ఆమెకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. తన నెల జీతం 3 లక్షల 50 వేల చెక్కును అభ్యర్థి నాగజ్యోతికి అందజేశారు. అలాగే రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి నెల జీతాన్ని లక్షా 50 వేల రూపాయల చెక్కును నాగజ్యోతికి అందజేశారు.
కాగా, జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌గా కొనసాగుతున్న బడే నాగజ్యోతి మంగళవారంహైదరాబాద్ బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాసంలో మంత్రి సత్యవతిని తన చాంబర్లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ తన నెల జీతాన్ని ఎమ్మెల్యే అభ్యర్థి నాగజ్యోతి గెలుపు కోరుతూ 3లక్షల 50 వేల రూపాయల చెక్కును ప్రోత్సాహకంగా అందజేశారు. నాగజ్యోతి గెలుపు కోసం తాము వెన్నంటే ఉంటూ గెలుపు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
నాగజ్యోతికి చెక్కును అందజేసిన మంత్రి సత్యవతి రాథోడ్, రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి