జూలపల్లి, జూన్ 15: పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కుమ్మరికుంట శివారులోని ఎస్సారెస్పీ డీ-83 కాలువలో గురువారం అడవిదున్న సంచారంతో కలకలం రేగింది. అటువైపు వెళ్లిన గ్రామస్తులు దీనిని చూసి భయాందోళనకు గురయ్యారు. సర్పంచ్ మేచినేని సంతోష్‌రావు ఇచ్చిన సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు. బుధవారం సమీపంలోని అడవి నుంచి పారిపోయి వచ్చిందని చెప్పారు. అడవిదున్నను పట్టుకొని అడవులకు తరలించాలని గ్రామస్తులు కోరారు.