హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాలలో సంచలన ఘటన చోటుచేసుకుంది. భర్తను చంపిన భార్య.. అతడి శవాన్ని అత్తారింటి వద్ద పడేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నంద్యాల జిల్లా నూనెపల్లికి చెందిన శేషాచలం(48), పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన రమణమ్మతో కొన్నేండ్ల క్రితం పెండ్లయింది.
వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. తరచూ గొడవలు జరుగుతుండటంతో రమణమ్మ పిడుగురాళ్లలోని పుట్టింటికి వెళ్లిపోయింది. తన తల్లికి ఆరోగ్యం బాగాలేదని రమణమ్మ చెప్పగా.. శేషాచలం పిడుగురాళ్లకు వెళ్లాడు. ఈ క్రమంలో శేషాచలంతో రమణమ్మ కుటుంబ సభ్యులు గొడవకు దిగారు. గొడవ పెద్దది కావడంతో రమణమ్మ, ఆమె తమ్ముడు… శేషాచలం కండ్లల్లో కారం చల్లి దాడికి పాల్పడగా అక్కడికక్కడే మరణించా డు. అనంతరం శేషాచలం మృతదేహా న్ని నంద్యాలకు తీసుకొచ్చి, అత్తారింటి దగ్గర పడేసి వెళ్లిపోయారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.