షాబాద్, ఆగస్టు 7 : భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం హైతాబాద్‌లో చోటుచేసుకున్నది. వారి కుమారుడు రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన అన్నె ప్రసాదరావు (83), అన్నె పార్వతి (72) హైతాబాద్‌లో నివాసం ఉంటున్నారు.
బుధవారం రాత్రి ప్రసాదరావు అస్వస్థతకు గురికావడంతో శంషాబాద్‌కు తీసుకువెళ్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. భర్త మరణవార్త తెలియగానే పార్వతి గుండెపోటుతో మరణించింది.