హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులకు జూన్ 2 నుంచి హెల్త్‌కార్డులు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఎలాంటి విధివిధానాలు ఖరారు చేయకపోవడంపై ఉద్యోగ సంఘాల మాజీ నేత దేవీప్రసాద్ ఆక్షేపించారు. కార్డులు ఇవ్వకుండానే ఉద్యోగుల వేతనాల నుంచి 1.5% నగదు కోతవిధించడం సరికాదని ఆదివారం ప్రకటనలో అభ్యంతరం వ్యక్తంచేశారు.
నెట్వర్క్ హాస్పిటల్ యాజమాన్యాలు తమతో ప్రభుత్వం ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని చెబుతున్నా.. నగదు మినహాయించుకోవడం దురదృష్టకరమని వాపోయారు. వెంటనే మినహాయించుకున్న సొమ్మును ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు.