Congress | కర్ణాటకలో తమకు ఫ్రీ బస్సులు ఎందుకోసం పెట్టారో మహిళలకు మొదట తలలు బాదుకున్నా అర్థం కాలేదు. కాంగ్రెస్ ప్రకటించిన అయిదు గ్యారంటీల అమలు కోసం ఆఫీసుల చుట్టూ ఎలాగూ చక్కర్లు కొట్టక తప్పదన్న ముందుచూపుతో ఏర్పాటుచేసి ఉంటారు.
తమ ఫ్రీ హామీల కోసం బస్‌చార్జీలు పెట్టుకొని మరీ తిరగాల్సి వస్తుందని మహిళలు ఎక్కడ శాపనార్థాలు పెడుతారేమోనన్న భయం తోనే ఫ్రీ జర్నీ పథకం పెట్టారని కన్నడ వనిత పసిగట్టింది. మొత్తం మీద కాంగ్రెస్ హామీలను కర్ణాటక మహిళలు అర్థం చేసుకున్నంత బాగా ఇంకేవరూ అర్థం చేసుకోలేరేమో!
-వెల్జాల