హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): దివ్యాంగుల పింఛన్లు, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం దురదృష్టకరమని అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వర్రావు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆదివారం సచివాలయంలో దివ్యాంగులకు సహాయ ఉపకరణాలను పంపిణీ చేసిన సీఎం రేవంత్రెడ్డి.. పింఛన్ల పెంపు విషయంపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.