Harish Rao | ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం పూర్తయ్యేదెన్నడూ..? ప్రశ్నించిన హరీశ్‌రావు
Harish Rao | ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం ఎప్పుడు పూర్తి చేస్తారు ? అపాయింట్మెంట్ డేట్‌ని ఎప్పుడు ప్రకటిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల్లో క్వశ్చన్ అవర్‌లో ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీపై అడిగిన ప్రశ్నలకు మంత్రి ఇచ్చిన సమాధానాలు ఒకరకంగా చెప్పాలంటే బాధ్యతా రహితంగా, తప్పుదోవ పట్టించేలా ఉన్నాయన్నారు.
Harish Rao | ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం ఎప్పుడు పూర్తి చేస్తారు ? అపాయింట్మెంట్ డేట్‌ని ఎప్పుడు ప్రకటిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల్లో క్వశ్చన్ అవర్‌లో ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీపై అడిగిన ప్రశ్నలకు మంత్రి ఇచ్చిన సమాధానాలు ఒకరకంగా చెప్పాలంటే బాధ్యతా రహితంగా, తప్పుదోవ పట్టించేలా ఉన్నాయన్నారు. జాప్యం జరగడానికి గల కారణాలు ఏంటీ? అన్నప్పుడు లేదండీ అన్నారని తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ప్రభుత్వం వచ్చి ఎనిమిదో నెల జరుగుతున్నది. ఇంకా జాప్యం జరుగలేదని చెప్పారు. ఎప్పటిలోగా ఈ ప్రతిపాదనలు అమలు చేసి.. నియమితరోజు ప్రకటించడం అవుతుందా? అంటే పరిశీలనలో ఉందని మంత్రి చెప్పారు. కాంగ్రెస్ మేనిఫెస్టో పేజీ నెంబర్ 28లో ఐటెమ్ నంబర్ 14లో టీఎస్ ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం అని పెట్టారు. ఇందులో ఆర్టీసీ కార్మికులను, ప్రభుత్వ విలీన ప్రక్రియ పూర్తి చేసి రెండు పీఆర్సీల బకాయిలను వెంటనే చెల్లిస్తాం అని చెప్పారు. ఎనిమిది నెలల సమయం సరిపోదా?’ అంటూ ప్రశ్నించారు
ఆర్టీసీ సిబ్బంది పీఆర్సీలోకి వచ్చేదెప్పుడు..?
‘వచ్చే పీఆర్సీ పరిధిలోకి ఆర్టీసీ కార్మికులను చేరుస్తాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు, సదుపాయాలు కల్పిస్తాం. ఆర్టీసీ బస్సులను ఆధునికకీరించి.. విస్తరిస్తాం. అధునాతమైన సౌకర్యాలతో కొత్త సర్వీసులను ప్రారంభిస్తాం. ఆర్టీసీ యూనియన్ పునరుద్ధరణకు అనుమతిస్తాం’ అని మేనిఫెస్టోలో చెప్పారు. విషయాల్లోకి వెళ్లకుండా మంత్రిని సూటిగా ప్రశ్నించ దలచుకున్నాను. మంత్రి ఎప్పటిలోగా అపాయింటెడ్ డే ప్రకటిస్తారు ? ఏ రోజు నుంచి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారు ? పరిశీలనలో ఉంది.. చూస్తాం.. చేస్తామని కాలయాపన చేయడం కాదు. ఖచ్చితమైన తేదీని ఈ సభ ద్వారా ఆర్టీసీ కార్మికులకు చెప్పాలని మంత్రిని కోరుతున్న. యూనియన్ పునరుద్ధరిస్తామని మీరు హామీ ఇచ్చారు. యూనియన్ పునరుద్ధరణ ఎప్పటిలోగా చేస్తారు ? మాకున్న సమాచారం ఏందంటే ప్రభుత్వం నుంచి యూనియన్ను పునరుద్ధరించేది లేదని ఉత్తర్వులు ఇచ్చినట్లుగా మా దృష్టికి వచ్చింది. ఉత్తర్వులు ఇచ్చారా? లేదా? ఇవ్వకపోతే ఎప్పటిలోగా యూనియన్ను పునరుద్ధరిస్తారు’ అంటూ నిలదీశారు.
ఆ చెక్ నెక్లెస్ రోడ్ చేరేదెన్నడూ..?
‘ఆర్టీసీలో చనిపోయిన కార్మికులకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో పిల్లలకు పర్మినెంట్ ఉద్యోగం ఇచ్చేవాళ్లం. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆ పర్మినెంట్ ఉద్యోగం అనే నిబంధన తీసివేసి.. మరో స్కీమ్‌ను పెట్టి కేవలం రూ.15వేల జీతం ఇచ్చి మూడేళ్లు పని చేస్తే అప్పుడు పర్మినెంట్ చేస్తామని చనిపోయిన కార్మికులకు మీ ప్రభుత్వం అన్యాయం చేసినమాట వాస్తవమా? ఇది ఎందుకు తెచ్చారు ? గత ప్రభుత్వంలాగా చనిపోయిన కార్మికుల పిల్లలకు వెంటనే రెగ్యులర్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి, మంత్రి నెక్లెస్ రోడ్లో మా ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిన బస్సులు వస్తే జెండా ఊపారు సంతోషం. ప్రభుత్వం నిరంతర ప్రక్రియ. అయితే, జెండా ఊపిన సందర్భంగా కార్మికులకు రూ.300కోట్ల చెక్కును సీఎం చూపించారు. ఇగో కార్మికులకు పీఆర్సీ బకాయిలు విడుదల చేస్తామని చెక్కు చూపారు. పాపం మంత్రి సీఎం వెళ్లిపోయాక డమ్మీ చెక్కులు కార్మికులు ఇచ్చి ఫొటోలు దిగారు. ఈ చెక్కులు ఫిబ్రవరి 10, 2024 రోజున ఇచ్చారు. మనం ఇవాళ జూలై నెలలో ఉన్నాం. దాదాపు ఐదునెలలైనా నెక్లేస్రోడ్ నుంచి ఆ చెక్కు బస్ భవన్‌కు చేరలేదు. ఆ చెక్కు ఎప్పడు చేరుతుంది ? ఎప్పుడు ఇస్తరు చెప్పాలని కోరుతున్నా’నన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయం : అదనపు కలెక్టర్ వేణుగోపాల్
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

