ముగిసిన రాజశ్యామల యాగం
రాష్ర్టానికి మంచి జరగాలని ఆకాంక్షిస్తూ సీఎం కేసీఆర్ నిర్వహించిన రాజశ్యామల యాగం శుక్రవారంతో ముగిసింది.
- మహాపూర్ణాహుతితో క్రతువు సమాప్తం
- పాల్గొన్న సీఎం కేసీఆర్ దంపతులు
- మంచి జరగాలి: స్వరూపానందేంద్ర
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి మంచి జరగాలని ఆకాంక్షిస్తూ సీఎం కేసీఆర్ నిర్వహించిన రాజశ్యామల యాగం శుక్రవారంతో ముగిసింది. ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో విశాఖ శ్రీశారదాపీఠం ఆధ్వర్యంలో వైదిక నియమాలను అనుసరిస్తూ, 3 రోజులపాటు రాజశ్యామల సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం కొనసాగింది. శుక్రవారం మహా పూ ర్ణాహుతితో యాగ క్రతువు పూర్తయింది. తెలంగాణ ప్రజలందరినీ రాజశ్యామల అమ్మవారు అనుగ్రహించాలని ఆకాంక్షిస్తూ సీఎం కేసీఆర్ ఈ యాగాన్ని నిర్వహించారని పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి కంకణం కట్టుకున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని ప్రశంసించారు. ఈ యాగంతో తెలంగాణలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమవుతుందని అన్నా రు. అనంతరం యాగంలో మంత్రించిన జలాలను కేసీఆర్ దంపతులపై చల్లారు.
వేదోక్తంగా మహా పూర్ణాహుతి
యాగశాలలో రాజశ్యామల అమ్మవారు శుక్రవారం నర్తనకాళి అలంకరణలో దర్శనమిచిచ్చా రు. వేకువజాము నుంచే రాజశ్యామల, సుబ్రహ్మణ్యేశ్వర మూల మంత్రాల హవనం ప్రారంభమైం ది. పూర్ణాహుతి సమయానికి నిర్దిష్ట సంఖ్యలో మూడు లక్షల సార్లు హవనాలను పూర్తి చేశారు. మహా పూర్ణాహుతిలో కేసీఆర్ దంపతులతోపా టు బంధుమిత్రులు, సన్నిహితులు పాల్గొన్నారు. పూర్ణాహుతిలో వినియోగించే పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలకు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర సమక్షంలో కేసీఆర్ దంపతులు పూజలు చేశారు. శూలిని దుర్గ కవచంతో అభిమంత్రించిన రక్షను కేసీఆర్‌కు కట్టా రు. శ్రీశారదాపీఠం నుంచి తెప్పించిన అమ్మవారి శేషవస్త్రాలను కేసీఆర్ దంపతులకు ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

