నల్లగొండ: ఎస్ఎల్బీసీ సొరంగం మార్గంలో (SLBC Tunnel) జరిగిన ప్రమాదంతో ఈ ప్రాజెక్టు ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. ఈ ప్రమాదంలో ఎనిమిది చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. అయితే ఈ ప్రాజెక్టును ఎందుకు చేపట్టారు, అసలు ఉద్దేశం ఏమిటి, పనులు ఎప్పుడు ప్రారంభమయ్యాయి, పనులు పూర్తయితే ఎవరికి లాభం చేకూరుతుంది వంటి విషయాలు తెలుసుకుందాం..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 4.1,8 ఏకరాలకు సాగునీరు, 516 ఫ్లోరైడ్ ఫీడ్త గ్రామాలకు తాగునీటిని అందించేందుకు ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం (SLBC Tunnel) రూపుదిద్దుకుంది. శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ నుంచి రోజుకు అర టీఎంసీ చొప్పున 60 రోజుల పాటు 30 టీఎంసీల నీటిని తరలించి సాగు తాగు నీటిని కల్పించాలని నిర్ణయించారు. 1979 లోనే ఈ ప్రాజెక్టు పై చర్చ మొదలై 1982 జూలై 29న 480 కోట్లతో సొరంగ మార్గం పనులకు అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. కానీ సొరంగ మార్గం ఆలస్యం అవుతుందని భావించి, అప్పటిలోగా తాత్కాలిక పద్ధతిలో పుట్టంగండి వద్ద లిఫ్ట్ ఏర్పాటు ద్వారా ఎంఆర్పీకి కి నీటిని తరలించే ప్రక్రియ మొదలుపెట్టారు. దీంతో సొరంగ మార్గం ప్రతిపాదనలు తాత్కాలిక వెనక్కి పెళ్లాయి.
2005లో అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి హయంలో ఎస్ఎల్బీసీ సొరంగం మార్గం ప్రాజెక్టు మళ్లీ తెరపైకి వచ్చింది. 2008 కోట్ల అంచనా వ్యయంతో 2005 ఆగస్టు 11 పరిపాలన అనుమతులు జారీ చేశారు 2006లో సొరంగ మార్గం పలుకు శంకుస్థాపన జరిగింది. అయితే ఈ సొరంగ మార్గం డిజైన్లోనే చాలా సంక్లిష్టత నెలకొంది. శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ మీదుగా భూమి ఉపరితలం నుంచి అర కిలోమీటర్ లోతులో ఈ సొరంగమార్గం ప్రతిపాదించారు. ఏకకాలంలో రెండు వైపులా రెండు టిబీఎం మిషన్ల ద్వారా పది మీటర్ల వ్యాసార్థం తవ్వకంతో ఈ సొరంగం పనులు మొదలుపెట్టారు. సొరంగానికి సిమెంటు దిమ్మలతో ప్లాస్టింగ్ అనంతరం 9 మీటర్ల వ్యాసార్థ సామర్థ్యంతో నీరు గ్రావిటీ ద్వారా రానుంది.
శ్రీశైలం రిజర్వాయర్‌లోని నీటిని తీసుకునే ప్రాంతం నుంచి చేపట్టిన ఇన్లేట్ పనులను 19.50 కిలోమీటర్లు అవ్వాల్సి ఉంది. ఇప్పటివరకు 13.935 కిలోమీటర్లు పూర్తయింది. ఇంకా 6.015 కిలోమీటర్ల దూరం తవాల్సి ఉంది. ఇటువైపు నుంచి శ్రీశైలం నిండిన ప్రతిసారి కూడా నెలలపాటు పనులు నిలిచిపోతున్నాయి. సొరంగ మార్గంలోకి భారీగా నీటి ఊట రావడంతో పాటు మట్టి పెల్లలు కూలుతుండడంతో పనులకు ఆటంకం జరుగుతూ ఉంది. ఇటీవల శ్రీశైలంలో నీటిమట్టం తగ్గడంతో ఈనెల 18వ తేదీ నుంచి తిరిగి సొరంగం తవ్వకం పనులు మొదలయ్యాయి. పనులు మొదలైన నాలుగు రోజుల్లోనే అక్కడ ప్రమాదం చోటుచేసుకుంది. ఇక మన్నెవారపళ్లి వైపు నుంచి కొనసాగుతున్న అవుట్లెట్ పనులు 20.435 కిలోమీటర్లు పూర్తయింది. ఇంకా 3.545 కిలోమీటర్లు తవాల్సి ఉంది. దీని మొత్తం పొడవు 23.980 కిలోమీటర్లు. ఈ ప్రధాన సొరంగంలో ఇంకా మొత్తం 9.56 కిలోమీటర్లు సొరంగాన్ని తవాల్సి ఉంది.
రెండవ సొరంగం.
ప్రధాన స్వరంగం అవుట్లెట్ వద్ద 7.64 టైఎంసీల సామర్ధ్యంతో నక్కలగండి రిజర్వాయర్‌ను నిర్మిస్తున్నారు. దాదాపు పూర్తయింది. ఇక్కడి నుంచి నీటిని పెండ్లి పాకల రిజర్వాయర్‌కు తరలించేందుకు 7.13 కిలోమీటర్ల రెండవ స్వరంగాన్ని చేపట్టారు. దీన్ని గుర్రపు డెక్క ఆకారంలో బ్లాస్టింగ్ పద్ధతిలో నిర్మాణం చేపట్టారు. ఇందులో సగభాగం ఇప్పటికే లైనింగ్ కూడా పూర్తిగా మరొక సగం లైనింగ్ పనులు కావాల్సి ఉంది. పెండ్లి పాకల రిజర్వాయర్ నుంచి 15 కిలోమీటర్ల ఓపెన్ ఛానల్ ద్వారా అక్కంపల్లి రిజర్వాయర్ కు నీటిని తరలిస్తారు. ఆక్కంపల్లి నుంచి ఇప్పటికే ఉన్న ఎమ్మార్పీ ప్రధాన కాలువ ద్వారా నీటిని పానగలు ఉదయం సముద్రం వరకు తరలిస్తారు. ఇక్కడి నుంచి తిరిగి మూసి రిజర్వాయర్ వరకు ఈ నీరు చేరుకొనుంది. ఇదే సమయంలో మధ్యలో పానగల్ ఉదయ సముద్రం రిజర్వాయర్ నుంచి బ్రాహ్మణ వెల్లంల ఎత్తిపోతల పథకానికి కూడా నీటిని పంపింగ్ చేయనున్నారు.