KTR | రైతు డిక్లరేషన్ హామీలేమయ్యాయి? : కేటీఆర్
KTR | ఎన్నికల సమయంలో రాహుల్‌గాంధీ రైతు డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన 33 హామీలు ఏమయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
మిర్యాలగూడ : ఎన్నికల సమయంలో రాహుల్‌గాంధీ రైతు డిక్లరేషన్ ( Rythu Declaration ) పేరుతో ఇచ్చిన 33 హామీలు ఏమయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. మిర్యాలగూడలో నిర్వహించిన రైతు ధర్నాలో ఆయన మాట్లాడారు. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, కేసీఆర్ ( KCR ) రూ.10 వేలు ఇస్తే తాము రూ.15 వేలు రైతుబంధు ఇస్తాం. కేసీఆర్ రెండు పంటలకు రైతుబంధు ఇస్తే తాము మూడు పంటలకు ఇస్తామన్న హామీపై ప్రశ్నల వర్షం గుప్పించారు.
కౌలు రైతులకు రైతుబంధు, వరి, పత్తికి క్వింటాల్‌కు రూ.500 బోనస్, రూ.2,500 మద్దతు ధర ఇస్తామని ప్రకటించారని తెలిపారు. 2022లో వరంగల్‌లో నిర్వహించిన రైతు డిక్లరేషన్‌లో కాంగ్రెస్ చెప్పిన హామీలను ధర్నాలో ప్రదర్శించారు. కేసీఆర్ అప్పట్లో కాంగ్రెస్‌ను నమ్మితే గోస పడతారని చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే యూరియా కోసం చెప్పులు లైన్లో పెట్టే రోజు వస్తుందని హెచ్చరించారని వెల్లడించారు.
కేసీఆర్ ప్రభుత్వంలో యూరియా కావాలంటే పొలం దగ్గరకే వచ్చేదని, ఇప్పుడు యూరియా దొరకని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. కాంగ్రెస్ వస్తే రైతుబంధుకు రాంరాం, దళితబంధు పోతుందని కేసీఆర్ చెప్పిన మాటలు నిజమవుతున్నాయని వ్యాఖ్యానించారు .
మూడు సార్లు రైతుబంధు ఎగ్గొట్టింది ఎవరు?
“తెలంగాణలో మూడు సార్లు రైతుబంధు ఎగ్గొట్టిన, బోనస్, రుణమాఫీ ద్రోహం చేసిన దివానా ఎవరని కేటీఆర్ ప్రశ్నించారు. దేశం అంతా వదిలించుకున్న దరిద్రం తెలంగాణకు తగిలిందని, నల్లగొండ జిల్లాలో ఆ దరిద్రాన్ని ప్రజలే తెచ్చిపెట్టుకున్నారని వ్యాఖ్యానించా రు. రైతులు నీళ్లు ఇవ్వాలని అడగాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ వాళ్ల రక్తాన్ని పంట పొలాలపై చల్లుతానని మాట్లాడారని ఆరోపించా రు. చంద్రబాబుకు గురుదక్షిణ కింద నీళ్లు వదలాలని రేవంత్‌రెడ్డి భావిస్తున్నారని ఆరోపించారు. మిగులు జలాలపై నిర్మించిన ప్రాజెక్టులకు నీళ్లు వదులుతున్నారని, పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు విడుదల చేస్తున్నారని ఆరోపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Endometriosis | ఎండోమెట్రియోసిస్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి..
Bharateeyudu 3 | ‘భారతీయుడు 3’ వర్సెస్ ‘స్పిరిట్’, ‘వారణాసి’.. ఈ బాక్సాఫీస్ పోరులో శంకర్ నిర్ణయం ఏంటి?
KTR | ఎన్హెచ్ఎం ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు : కేటీఆర్
Divya Mittal: జన నీతి భారత్ పార్టీ పెట్టిన మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

