బోధన్, సెప్టెంబర్ 30: సెప్టెంబర్ 17 లోపు నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఏమైందని ఫ్యాక్టరీ కార్మికులు ప్రశ్నించారు. ఏకంగా సీఎం మాటకే దిక్కు లేకపోతే? ఎలా అని నిలదీశా రు. సోమవారం నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని షుగర్ ఫ్యాక్టరీ ఎదుట కార్మిక సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. అసియాలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారమైన నిజాం షుగర్స్‌ను తెరిపిస్తామన్న కాంగ్రెస్ ప్రభు త్వం.. ఎలాంటి విధివిధానాలు రూపొందించలేదని వాపోయారు. ప్రైవేట్ యాజమాన్యం అక్రమంగా లేఆఫ్ ప్రకటించిందని, వేతనాలు లేక తమ పరిస్థితి దుర్భరంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో కుమారస్వామి, రవిశంకర్‌గౌడ్, శ్రీనివాస్, బాలకృష్ణ, రాంబాబు, భాస్కర్ పాల్గొన్నారు.