హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): పర్యావరణానికి హాని కలిగిస్తున్న సింథటిక్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)కృషి చేస్తున్నది.
ఇప్పటికే సింథటిక్ ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా వ్యవసాయ వ్యర్థాలతో బయో పాలిమర్లను తయారు చేసిన ఆ సంస్థ.. తాజాగా కోడి ఈకలు, బొచ్చుతో బయో ప్లాస్టిక్‌ను రూపొందించడంపై దృష్టి సారించింది. మెడికల్, ఆటోమొబైల్, ప్యాకేజింగ్ అవసరాలకు అనువుగా ఉండేలా దీన్ని తయారు చేసేందుకు కసరత్తు చేస్తున్నది.