బీపీఈడీ, యూజీ డీపీఈడీ కోర్సుల్లోని సీట్ల భర్తీ వెబ్ కౌన్సెలింగ్ ఆగస్టు 1 నుంచి ప్రారంభంకానున్నది. ఆగస్టు 1 నుంచి 9 వరకు అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇదే తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. ఆగస్టు 6 నుంచి 8వరకు ఎన్సీసీ, సీఏపీ, పీహెచ్, స్పోర్ట్స్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది.
ఆగస్టు 10న అర్హులైన వారి జాబితాను ప్రదర్శిస్తారు. ఆగస్టు 11,12న వెబ్ ఆప్షన్లు ఎంపికచేసుకోవచ్చు. 18న సీట్లు కేటాయిస్తారు. 18 నుంచి 21 వరకు సీటు వచ్చిన కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.