కాళోజీ హెల్త్ యూనివర్సిటీ : రాష్ట్రంలోని ప్రైవేట్ వైద్య కళాశాలల్లో పీజీ యాజమాన్య కోటా ప్రవేశాలకు కాళోజీ ఆరోగ్య విశ్వ విద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 23 ఉదయం 8 గంటల నుంచి 25 తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.
ఈ మేరకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ మంగళవారం మొదటి విడత యాజమాన్య కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చెసింది. యూనివర్సిటీ విడుదల చేసిన అర్హుల జాబితాలోని అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. మరింత సమాచారానికి యూనివర్సిటీ వెబ్సైట్ ను సందర్శించాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.