నల్లగొండ : సాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు త్వరలో ప్రభుత్వం నీరు విడుదల చేస్తుందని, రైతులు ఆందోళన గురి కావద్దని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. సోమవారం కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలకు రాబోయే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కవని ఎద్వేవా చేశారు. తొమ్మిదేళ్లుగా నియోజకవర్గంలో కనిపించని నాయకులు నిన్న మొన్న రైతులు గుర్తుకొచ్చి ముసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నీరు మునగాల మండలాలకు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల పేరుతో ఉత్తంకుమార్ రెడ్డి లక్షల రూపాయలు కమిషన్లు తిన్నారని విమర్శించారు.
పార్లమెంటులో 33 శాతం మహిళా బిల్లు ఆమోదంలో కాంగ్రెస్ ఎంపీలు ఉత్తం కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి, వెంకటరెడ్డి హాజరు కాలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ ఎంపీలు మహిళా బిల్లు ఆమోదంలో పాల్గొన్నారు. బీసీ కులగణన కోసం అసెంబ్లీలో ఆమోదించి తీర్మానాన్ని ఏనాడో కేంద్రానికి పంపారన్నారు.
కరోనా సమయంలో కాంగ్రెస్ నాయకులు ఎటుపోయారని, కోదాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రజలతో ఉండి కోదాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. కాంగ్రెస్ నాయకులు దద్దమ్మలని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్దే విజయమన్నారు. ఈ సమావేశంలో నాయకులు అజయ్ కుమార్, చందు నాగేశ్వరరావు, ఈదుల కృష్ణయ్య, ఇమ్రాన్ ఖాన్, రషీద్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.