Former MLA Chittem | కాంగ్రెస్ అరాచక పాలనపై ప్రజలను చైతన్యం చేస్తాం : మాజీ ఎమ్మెల్యే చిట్టెం
Former MLA Chittem | కాంగ్రెస్ అరాచక పాలనపై ప్రజలను చైతన్యం చేస్తామని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ప్రకటించారు.
నారాయణపేట : కాంగ్రెస్ ( Congress ) అరాచక పాలనపై ప్రజలను చైతన్యం చేస్తామని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ( Chittem Rammohan Reddy ) ప్రకటించారు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని నివాసంలో సోమవారం నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 2 నుంచి మక్తల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజలను చైతన్యం చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.
కాంగ్రెస్ రాబందుల పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించుకునేందుకు ప్రతి కార్యకర్త సమాయ త్తం కావాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని కార్యకర్తలకు సూచించారు. సమావేశంలో వివిధ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

