చెక్‌పవర్ తొలగిస్తే సహించం.. ఉపసర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కార్తీక్
ఉపసర్పంచ్‌ల చెక్‌పవర్ రద్దు చేయాలన్న నిర్ణయాన్ని తక్షణమే ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని ఉపసర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల కార్తీక్ డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఖైరతాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : ఉపసర్పంచ్‌ల చెక్‌పవర్ రద్దు చేయాలన్న నిర్ణయాన్ని తక్షణమే ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని ఉపసర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల కార్తీక్ డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇది రాష్ట్రంలోని 12,780 మంది ఉపసర్పంచ్‌ల భవితవ్యానికి సంబంధించిన అంశమని అన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని, లేనిపక్షంలో ఉద్యమకార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.
చెక్‌పవర్ రద్దు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తూ ఈ నెల 25న చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చామని, ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద జరిగే నిరసన కార్యక్రమానికి ఉపసర్పంచ్లు వేలాదిగా హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వహయాంలో సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లకు ఉమ్మడి చెక్‌పవర్ ఉండేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సంప్రదాయాన్ని దెబ్బతీసే ప్ర యత్నం చేస్తున్నదని ఉపసర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర అధికార ప్రతినిధి కరుణాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు తెలంగాణ కోసం ఉద్యమించామని, ఇప్పుడు తమ ఆత్మగౌరవం కోసం కొట్లాడుతామన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

