హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేగా న్యాయస్థానంలో అనర్హత కేసు విచారణను ఎదుర్కొంటున్న అరికెపూడి గాంధీని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్‌గా తాము ఒప్పుకోబోమని బీఆర్ఎస్ స భ్యులు తేల్చిచెప్పారు. అసెంబ్లీ కమిటీ హాలు లో మంగళవారం అరికెపూడి గాంధీ అధ్యక్షతన పీఏసీ సమావేశం నిర్వహించగా, బీఆర్ఎ స్ సభ్యులైన ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, ఎల్ రమణ బహిష్కరించారు. ఎమ్మెల్యే హరీశ్‌రావును కాదని అరికెపూడి గాంధీని పీఏసీ చైర్మన్‌గా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు.
తమ పార్టీ నుంచి పీఏసీ చైర్మన్‌గా వేసిన బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ అనర్హత కేసు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పీఏసీ చైర్మన్‌గా సమావేశాన్ని నిర్వహించడం సమంజసం కాదని స్పష్టంచేశారు.
పార్లమెంటరీ ప్రజాస్వామ్య సంప్రదాయాలకు విరుద్ధంగా పీఏసీ చైర్మన్ ఎంపిక చేయడం దారుణమని పేర్కొన్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు నామినేషన్‌ను కాదని, నామినేషన్ వేయని అరికెపూడి గాంధీని అక్రమంగా ఎంపిక చేయడం సరికాదని తెలిపారు. పీఏసీ చైర్మన్ ఎన్నికపై సర్కారు పునరాలోంచాలని కోరినా అందులో ఎటువంటి మార్పు రాకపోవడంతో తాము సమావేశాన్ని బహిష్కరించామని తెలిపారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి పార్టీకి వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్‌లో చేరిన అరికెపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.
ఇప్పటి వరకు మూడు సమావేశాలను బహిష్కరించిన విషయాన్ని గుర్తుచేశారు. అవసరమైతే 30 సమావేశాలను బహిష్కరిస్తాం. కానీ, ఎట్టి పరిస్థితుల్లో వెన్నుపోటుదారుడిని పీఏసీ చైర్మన్‌గా ఒప్పుకోబోమని తేల్చిచెప్పారు. హరీశ్‌రావును ఇప్పటికైనా పీఏసీ చైర్మన్‌గా నియమించాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ ప్రతిపక్ష సభ్యుడికి ఇవ్వాల్సిన పీఏసీ చైర్మన్ పదవిని సీఎం రేవంత్‌రెడ్డి తప్పుడు ఆలోచనలతో పార్టీ మారిన సభ్యుడికి ఇవ్వడం అప్రజాస్వామికమని విమర్శించారు. ఎమ్మెల్సీ రమణ మాట్లాడుతూ అరికెపూడి గాంధీ ఇంతకూ ఏ పార్టీ సభ్యుడో ధైర్యముంటే చెప్పాలని డి మాండ్ చేశారు. గాంధీని పీఏసీ చైర్మన్‌గా అంగీకరించే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు.