జవహర్‌నగర్, జూన్ 10: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ ప్రతిష్టత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె, పట్టణ ప్రగతితో రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాలు కొత్త హంగలను సంతరించుకుంటున్నాయని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆదివారం జవహర్‌నగర్ కార్పొరేషన్‌లోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాల్లరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పచ్చని వాతావరణం నెలకొందంటే సీఎం కేసీఆర్‌కే ఈ ఘనత దక్కుతుందన్నారు. గత ప్రభుత్వాలలో రాష్ట్రం ఎడారిలా మారిందని, నేడు పచ్చని కోనసీమగా విలసిల్లుతుంన్నారు. అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందంటే అందుకు సీఎం కేసీఆర్ ముందుచూపేనన్నారు.
జవహర్‌నగర్‌లో చెత్త డంపింగ్‌యార్డ్ దుర్వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో చెత్త డంపింగ్ యార్డ్‌కు కొత్త టెక్నాలాజీతో క్యాంపింగ్ చేసి వాసన రాకుండా చేశామన్నారు. కార్పొరేషన్‌ను అందమైన నగరంగా తీర్చిదుద్దుతున్నామని హామీనిచ్చారు. అనంతరం 15వ డివిజన్లో పల్లె ప్రగతిలో భాగంగా మొక్కలను నాటారు.
మున్సిపల్ కార్యాలయంలో తడి, పొడి చెత్త వాహనాలను ప్రారంభించి, కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో మేయర్ కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, కమిషనర్ జ్యోతిరెడ్డి, డీఈఈ చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు.