కల్వకుర్తి, సెప్టెంబర్ 29 : సీఎం రేవంత్‌రెడ్డిని నోటికొచ్చినట్టు దూషిస్తున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీపీసీసీకి ఫిర్యాదు చేయనున్నట్టు నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన కల్వకుర్తిలో మీడియాతో మాట్లాడారు. ఇతర పార్టీల్లో ఇబ్బందులకు గురై, కేసుల పాలైన మల్లన్నను కాంగ్రెస్ పార్టీ అక్కున చేర్చుకొని ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఒక పార్టీలో ఉన్నప్పుడు ఎలా నడుచుకోవాలో తెలియకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎం రేవంత్‌తోపాటు ఎమ్మెల్యే నారాయణరెడ్డిని చులకన చేసి మాట్లాడటం సరికాదని సూచించారు. తీన్మార్ మల్లన్నపై టీపీసీసీకి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.