కంది, నవంబర్ 16 : దేశ రక్షణ రంగ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఉద్యమిస్తామని సీడీఆర్ఏ జాతీయ ప్రధాన కార్యదర్శి అజయ్ అన్నా రు. బుధవారం సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలోని సీనియర్ క్లబ్లో నిర్వహించిన కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ గుర్తింపు పొందిన రక్షణ సంఘాల కూటమి (సీడీఆర్ఏ) జాతీయ కార్యవర్గ సమావేశంలో అజయ్ మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించించామని తెలిపారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎస్బీ చౌబే, ప్రధాన కార్యదర్శిగా అజయ్ (ఓడీఎఫ్), ఉపాధ్యక్షులుగా సూర్యకుమారి, సందీప్ ముఖర్జీ, రాజ్‌కుమార్ చౌహాన్, జాన్సన్, అదనపు ప్రధాన కార్యదర్శిగా ఎస్కే శుక్ల్లా, మహేంద్రపాల్ సింగ్, ఓంప్రకాశ్ సాహు, అంటోని యాగప్పన్, శంకర నారాయణ, జోనల్ కార్యదర్శులుగా వినోద్ పవార్, ఇంద్రవీర్సింగ్, ప్రమోద్, కాంబ్లే, అనిత, సుబ్రతకుమార్, ప్రదీప్, ఆర్బీ సింగ్ ఎన్నికయ్యారు.