పాలమూరు పట్టణానికి స్వచ్ఛమైన నీటిని అందిస్తాం
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | మురికి కూపంగా మారిన పాలమూరు మినీ ట్యాంక్ బండ్‌కు స్వచ్ఛమైన కృష్ణా నీటిని తరలించాలని ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

మహబూబ్‌నగర్ : మురికి కూపంగా మారిన పాలమూరు మినీ ట్యాంక్ బండ్‌కు స్వచ్ఛమైన కృష్ణా నీటిని తరలించాలని ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్ పట్టణానికి పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నీటిని తరలించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలోని తన కార్యాలయంలో పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
మహబూబ్ నగర్ జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఉదండాపూర్ రిజర్వాయర్ కాలువల నిర్మాణంపై ప్రాజెక్టు సీఈ వి. రమేష్ , ఎస్.ఈ కె. శ్రీనివాస్ తో సమావేశమయ్యారు. ఉదండాపూర్ రిజర్వాయర్ నుంచి ఫతేపూర్ మైసమ్మ కాలువ ద్వారా కొత్తచెరువుకు అక్కడి నుంచి మహబూబ్ నగర్ పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్(పెద్ద చెరువు)కు కృష్ణా నీటిని తరలించాలని మంత్రి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.
ఒకప్పుడు స్వచ్ఛమైన నీటితో కళకళలాడిన పెద్ద చెరువు తిరిగి పూర్వ వైభవం సంతరించుకునాలని కోరారు. ఉదండాపూర్ రిజర్వాయర్ – హన్వాడ కాలువ ద్వారా… హన్వాడ, పెద్దరాయపల్లి చెరువులతో పాటు మరో 28 గొలుసుకట్టు చెరువులను కృష్ణా జలాలతో నింపేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.
వీటితో పాటు ఉదండాపూర్ కాలువ ద్వారా డివిటిపల్లి లో నిర్మిస్తున్న ఐటీ కారిడార్ కు నీటి సరఫరా అందించాలని మంత్రి అధికారులకు సూచించారు. కొత్త చెరువు ద్వారా మినీ ట్యాంక్ బండ్ కు స్వచ్ఛమైన కృష్ణానది జలాలు తీసుకొస్తున్న నేపథ్యంలో మినీ ట్యాంక్ బండ్ కు పట్టణంలోని మురికి నీరు రాకుండా చుట్టూ కట్టను నిర్మించాలని మంత్రి అధికారులకు సూచించారు.
మినీ ట్యాంక్ బండ్ చుట్టూ పర్యాటకంగా అభివృద్ధి చేయటానికి పర్యాటక శాఖ అధికారులు ప్రణాళికలను రూపొందించాలని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి..
మంత్రి ఎర్రబెల్లిని అభినందించిన కేటీఆర్
అటవీ శాఖ ఉద్యోగులు విధిగా వ్యాక్సిన్ వేసుకోవాలి
తెలంగాణలో టీడీపీకి స్థానం లేదు : మంత్రి హరీశ్‌రావు
శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బోల్తా..
రాజన్న ఆలయంలో భక్తుల దర్శనానికి అనుమతి రద్దు
ఐదేండ్ల తర్వాత హాఫ్‌సెంచరీ చేసిన స్టార్ ఆల్‌రౌండర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

