
హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): 2019 వినియోగదారుల పరిరక్షణ చట్టం సక్రమంగా అమలయ్యేందుకు కృషి చేస్తామని దక్షిణాది రాష్ర్టాల వినియోగదారుల సమన్వయ సమితి అధ్యక్షుడు డాక్టర్ పల్లెపాడు దామోదర్ వెల్లడించారు. 24న జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆధునిక టెక్నాలజీతోపాటు వ్యాపారాల్లో మోసాలు కూడా పెరిగిపోతున్నాయని, ముఖ్యంగా ఆన్లైన్ మార్కెటింగ్‌లో మోసాలు పెరుగుతున్నాయని వివరించారు. జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయిలో వినియోగదారుల పరిరక్షణ కమిటీలను ఏర్పాటు చేసి చట్టం అమలుకు కృషి చేస్తామని, ప్రతి రాష్ట్రంలో వినియోగదారుల కోసం ప్రత్యేక కార్యాలయాలు, టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేస్తామని వివరించారు.