మహబూబ్‌నగర్, జూలై 30 (నమస్తేతెలంగాణ ప్రతినిధి)/హైదరాబాద్/న్యూస్‌నెట్‌వర్క్: కృష్ణా, తుంగభద్ర నదులకు భారీగా వరద వస్తున్నది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌తోపాటు తుంగభద్ర డ్యాంలకు పెద్ద మొత్తంలో ఇన్‌ఫ్లో నమోదవుతున్నది. మంగళవారం జూరాలకు 2.90 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా 2,86,115 క్యూసెక్కులు విడుదల చేశారు. శ్రీశైలం జలాశయం వద్ద వరద పెరగడంతో డ్యాం 10 క్రస్ట్‌గేట్లను 10 అడుగులమేర ఎత్తి సాగర్‌కు అధికారులు నీటిని విడుదల చేశారు. ఇన్‌ఫ్లో 4,13,173 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 3,32, 447 క్యూసెక్కులుగా నమోదైంది. నాగార్జునసాగర్‌కు 1,05,710 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 6,877 క్యూసెక్కులు అవుట్‌ఫ్లో కొనసాగుతున్నది. కాగా మేడిగడ్డ బరాజ్‌కు 7,25,050 క్యూసెక్కులు, అన్నారం బరాజ్ కు 6,894 క్యూసెక్కుల ప్రవాహం వస్తున్నది.
భద్రాచలం వద్ద 43 అడుగుల నీటిమట్టం
భద్రాచలం వద్ద మంగళవారం సాయంత్రానికి 43 అడుగులకు నీటిమట్టం చేరింది. కాగా, కాళేశ్వరం వద్ద మంగళవారం 7.25 లక్షల క్యూసెక్కులు, సమ్మక్క బరాజ్ వద్ద 9,15,560 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతున్నది.