మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లావ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షాలు (Heavy Rain) కురుస్తున్నాయి. మహబూబ్‌నగర్ పట్టణంలో కురిసిన వానలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గణేశ్ నగర్‌తోపాటు, బస్టాండ్ సమీపంలోని జగ్జీవన్‌రామ్ నగర్ కాలనీలో ఇళ్లలోకి నీరు చేరింది. పెద్ద చెరువు వైపు వెళ్లే ప్రధాన కాల్వ చెత్తాచెదారంతో మూసుకుపోవడంతో అటువైపు వెళ్లాల్సిన నీళ్లు ఇళ్లలోకి మళ్లాయి. పెద్ద చెరువుకు దిగవన ఉన్న బీకే రెడ్డి కాలనీ, పీర్లబాయి సహా పలు ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు ప్రవహిస్తున్నది. మహమ్మదాబాద్-ఇబ్రహీంబాద్ మధ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మహబూబ్‌నగర్-కోస్గి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
వరద ఉధృతికి మిడ్జిల్ మండలం వాడ్యాల శివారులో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ (KLI) ప్రధాన కాలువకు గండి పడింది. దీంతో వరి, పత్తి పొలాలు నీటమునిగాయి. శంకర సముద్రం నుంచి నీరు విడుదల చేయడంతో మదనాపురం మండలంలోని దంతనూరు-శంకరమ్మపేట గ్రామాల మధ్య వాగ ఉధృతంగా ప్రవహిస్తున్నది. రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
భారీ వర్షాలకు నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలలోని ఎక్కమెడిలో ఓ ఇల్లు కూలిపోయింది. దీంతో అందులో నిద్రిస్తున్న తల్లీకూతుళ్లు హన్మమ్మ, అంజిలమ్మ మృతిచెందారు. దేవరకద్ర మండలం కోయిల్‌సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్నది. దీంతో ఏ క్షణంలోనైనా ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉండటంతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. జడ్చర్ల పట్టణంలోని శివాజీ నగర్లో ఇండ్లలోకి నీరు చేరింది.
వనపర్తి జిల్లాలోని సరళ సాగర్ ప్రాజెక్టు గేట్లు తెరచుకున్నాయి. దీంతో మదనాపూర్ గ్రామ శివార్లలోని వాగు పొంగిపొర్లుతున్నది. ఈ నేపథ్యంలో ఆత్మకూరు, అమరచింత, మక్తల్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కొత్తకోట మండలం కానాయపల్లి గ్రామ సమీపంలోని శంకర సముద్రం రిజర్వాయర్ రెండు గేట్లను మూడు అడుగుల వరకు ఎత్తి దిగువకు 1500 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి ప్రాజెక్టులోనికి 2500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది.
కాగా, భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదివారం అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లు సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లొద్దన్నారు. ఏదైనా సమస్య ఉన్నట్లయితే సహాయ కేంద్రాల్లో సంప్రదించాలన్నారు.
కాల్‌సెంటర్లు..