ఎయిర్‌పోర్టుల్లో నాసిరకం నిర్మాణాలు!
దేశంలోని విమానాశ్రయాల్లో నాసిరకం నిర్మాణాలపై ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇటీవల చోటుచేసుకున్న వరుస ప్రమాద ఘటనలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
- రాజధాని ఢిల్లీలో కూలిన ఎయిర్‌పోర్టు పైకప్పు
- లక్నో విమానాశ్రయంలో లీకేజీ
- మధ్యప్రదేశ్, గుజరాత్లోనూపలు ఘటనలు
- మోదీ ప్రభుత్వ అవినీతి వల్లే
- కేంద్రంపై విపక్ష పార్టీల ధ్వజం
న్యూఢిల్లీ, జూన్ 30: దేశంలోని విమానాశ్రయాల్లో నాసిరకం నిర్మాణాలపై ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇటీవల చోటుచేసుకున్న వరుస ప్రమాద ఘటనలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత నాలుగు రోజుల వ్యవధిలో దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్‌పోర్టుతో సహా బీజేపీ పాలిత రాష్ర్టాలైన మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్, గుజరాత్‌లోని రాజ్‌కోట్, యూపీలోని లక్నో విమాశ్రయాల్లో పైకప్పులు కూలడం, వర్షాలకు నీళ్ల లీకేజీ వంటి ఘటనలు జరిగాయి. కేంద్రంలో పదేండ్ల మోదీ ప్రభుత్వ అవినీతి, నిర్లక్ష్యం వల్లే నాసిరకంగా మౌలిక సదుపాయాలు కూలిపోతున్నాయని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
కీలకమైన ఢిల్లీ ఎయిర్‌పోర్టులోనే..
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గత శుక్రవారం టెర్మినల్-1 వద్ద పైకప్పు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో క్యాబ్ డ్రైవర్ మరణించగా, మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. విమానాశ్రయంలో ప్రయాణికుల సామర్థ్యాన్ని పెంచే టెర్మినల్ ఆధునీకరణను ప్రధాని మోదీ ప్రారంభించిన నాలుగు నెలల్లోపే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
3 నెలల క్రితమే ప్రారంభం
ప్రధాని మోదీ మూడు నెలల క్రితం ప్రారంభించిన మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ ఎయిర్‌పోర్టులోనూ గత గురువారం ఇదే విధంగా పైకప్పు కూలి ఓ కారుపై పడింది. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు.
రాజ్‌కోట్ ఎయిర్‌పోర్టులో కూలిన కెనోపీ
శనివారం గుజరాత్‌లోని రాజ్‌కోట్ ఎయిర్‌పోర్టు టెర్మినల్ బయట వాహనాలు ఆగే చోట ఏర్పాటు చేసిన కెనోపీ భారీ వర్షాలకు కుప్పకూలింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టును ప్రధాని మోదీ గత ఏడాది జూలైలో ప్రారంభించారు.
లక్నో ఎయిర్‌పోర్టులో నీళ్ల లీకేజీ
తాజాగా ఉత్తరప్రదేశ్‌లో అదానీ గ్రూపు నిర్వహిస్తున్న లక్నో ఎయిర్‌పోర్టు టెర్మినల్-3 పైకప్పు నుంచి నీళ్లు లీకేజీ అవుతున్న వీడియో శనివారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ కొత్త టెర్మినల్‌ను కూడా మూడు నెలల క్రితమే ప్రారంభించారు. నీళ్ల లీకేజీ ఘటనపై ప్రయాణికులు భయాందోళన, తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘ ఒక అంతర్జాతీయ విమానాశ్రయం పైకప్పు నుంచి నీరు కారడం మంచి సంకేతం కాదు. ఇది నాసిరకపు పనిని ప్రతిబింబిస్తుంది’ అని శరద్ కుమార్ అనే వ్యక్తి పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

