Talasani Srinivas Yadav | అభివృద్ధికి మారుపేరైన బీఆర్ఎస్కే మరో అవకాశం ఇవ్వాలి: మంత్రి తలసాని
Talasani Srinivas Yadav | అభివృద్ధికి మారుపేరుగా ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కే ప్రజలు మరో అవకాశం ఇవ్వాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. శుక్రవారం మధ్యాహ్నం మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి.. తెలంగాణ రాష్ట్రంలో, హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి గురించి వెల్లడించారు.
హైదరాబాద్: అభివృద్ధికి మారుపేరుగా ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కే ప్రజలు మరో అవకాశం ఇవ్వాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. శుక్రవారం మధ్యాహ్నం మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి.. తెలంగాణ రాష్ట్రంలో, హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి గురించి వెల్లడించారు. హైదరాబాద్ అభివృద్ది కళ్ల ముందే కనిపిస్తున్నదని చెప్పారు.
హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పాత్ర ఎంతో ఉన్నదని మంత్రి తలసాని తెలిపారు. జనం ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చి హైదరాబాద్‌లో హాయిగా బతుకుతున్నరని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర సర్కారు చిన్న చూపు చూస్తున్నదని ఆరోపించారు. అయినా తొమ్మిదేళ్లుగా రాష్ట్రంలో అద్భుత కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు.
దేశంలో 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తలసాని చెప్పారు. మరే రాష్ట్రంలోనూ 24 గంటల కరెంటు లేదని అన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో రైతు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొంటున్నదని మంత్రి చెప్పారు. ఆడపిల్ల పెళ్లికి అండగా నిలుస్తున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని మంత్ర పేర్కొన్నారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి బీఆర్ఎస్ సర్కారు అనేక పథకాలను తీసుకొచ్చిందని మంత్రి తెలిపారు. ఐటీ రంగంలో కూడా రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందని చెప్పారు. కరోనా కాలంలో వలస కార్మికులను తమ ప్రభుత్వం ఆదుకున్నదని మంత్రి తలసాని గుర్తు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

