మహబూబ్నగర్, ఏప్రిల్ 18 : ఇందిరమ్మ చీరల పంపిణీలో ఓ వ్యక్తి వార్డు మహిళా ఆఫీసర్పై దాడి చేసిన ఘటన శనివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. మహబూబ్నగర్ పట్టణంలోని 29 వార్డు హనుమాన్పురలో వార్డు ఆఫీసర్ యాదమ్మ సిబ్బందితో కలిసి ఇందిరమ్మ చీరలు పంపిణీచేశారు. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి తమకూ చీరలు ఇవ్వాలని కోరగా.. వార్డుకు వచ్చి ఇస్తామని చెప్పారు. మా ఇల్లు ఇక్కడే ఉందని బెదిరిస్తూ.. వార్డు ఆఫీసర్పై దాడి చేయగా ఆమె కంటికి తీవ్ర గాయమైంది. దవాఖానకు వెళ్లి చికిత్స చేయించుకున్న అనంతరం దాడి చేసిన వ్యక్తిపై ఫిర్యాదు చేసింది.