నాగర్కర్నూల్ : నాగర్ కర్నూల్ (Nagarkurnool)జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో(Local body elections) గెలిచిన ఓ వ్యక్తి హఠాత్తుగా మృత్యువాత పడటం స్థానికంగా విషాదం నింపింది. ఈ విషాదకర సంఘటనబిజినపల్లి మండలం వెంకటాపూర్లో గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రెండో విడుత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గ్రామానికి చెందిన జుర్రు మహేష్ యాదవ్ (34) వార్డు మెంబర్ గా పోటీ చేసి నిన్న విజయం సాధించాడు.
కాగా, అర్ధరాత్రి నిద్రలోనే గుండెపోటుతో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతునికి భార్య లావణ్య తో పాటు ఇద్దరు సంతానం ఉన్నారు. మహేష్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.