హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 1: రాష్ట్రంలో రైతులకు యూరియా కొరత తీవ్రంగా ఉన్నదని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. మంగళవారం హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. యూరియా కొరత తీర్చాలని కేంద్రమంత్రిని కలిసి విన్నవించామని తెలిపారు. పేదలకు డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని పేర్కొన్నారు. సమావేశంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. నాయకులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు , కార్యకర్తలు పాల్గొన్నారు.