నల్లబెల్లి, సెప్టెంబర్ 8: ఓ అధికారితోపాటు కాంగ్రెస్ కార్యకర్తల వేధింపులు భరించలేక తహసీల్ కార్యాలయ జూనియ ర్ అసిస్టెంట్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిం ది. ఈ ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో సోమవారం చోటుచేసుకున్నది. బా ధిత మహిళ సూసైడ్ నోట్ కథ నం ప్రకారం.. నల్లబెల్లి తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వాంకుడోత్ కల్పనను మండలంలోని బిల్యానాయక్తండాకు చెందిన మాలోత్ చరణ్‌సింగ్ అనే కాంగ్రెస్ కార్యకర్త లైంగికంగా వేధిస్తున్నాడు. తనకు లొంగడంలేదనే కారణంతో కలెక్టర్‌కు తప్పుడు ఆరోపణలతో ఫిర్యాదు చేశాడు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన పత్రాన్ని మాజీ ఎంపీటీసీ మాలోత్ మోహన్ మొబైల్ నుంచి చరణ్‌సింగ్ తన మొబైల్‌కు వాట్సాప్ చేయించాడని పేర్కొంది.
ఓ భూమి విషయంలో గిర్దావరితోపాటు తనను చంపుతామని మాజీ ఎంపీటీసీ మాలోత్ మోహన్ ఇటీవల బెదిరించినట్టు వెల్లడించింది. వీటన్నింటికీ ప్రధాన కారణం తహసీల్దార్ కృష్ణ అని సూసైడ్ నోట్లో తెలిపింది. ఈ క్రమంలో కార్యాలయంలోనే పురుగుల మందు తాగింది. వెంటనే తహసీల్దార్ ఆమెను నర్సంపేటలోని ప్రైవేట్ దవాఖానలో చేర్పించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. తాను చనిపోయాక పిల్లల భవిష్యత్తును ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చూసుకోవాలని ఆమె తన సూసైడ్ నోట్లో వేడుకున్నది. తనకు ఈ పరిస్థితిని కల్పించిన అధికారితోపాటు కాంగ్రెస్ కార్యకర్తలపై చర్యలు తీసుకొని తన కుటుంబానికి న్యాయం చేయాలని పేర్కొన్నది.
తన భర్త మృతి వెనుక కూడా తహసీల్దార్ హస్తం ఉన్నదని డిప్యూటీ తహసీల్దార్ రాజేష్‌ఖన్నా సతీమణి ఆరోపించారు. తహసీల్దార్ మానసికంగా వేధిస్తూ కలెక్టర్‌కు తప్పుడు సమాచారం ఇవ్వడంతోపాటు తీవ్రంగా మందలించడంతో తన భర్త మనోవేదనతో దవాఖానపాలై ఇటీవల మృతిచెందినట్టు ఆమె తెలిపారు.