150 కిలోమీటర్లు.. నాన్‌స్టాప్ రన్
- హనుమకొండ నుంచి హైదరాబాద్ వరకు..
- ప్రారంభించిన వరంగల్ సీపీ తరుణ్‌జోషి
నయీంనగర్, ఆగస్టు 6: 150 కిలోమీటర్ల నాన్‌స్టాప్ రన్‌ను వరంగల్ పోలీసు కమిషనర్ తరుణ్‌జోషి జెండా ఊపి ప్రారంభించారు. హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ రెండో గేట్ సమీపంలోని శ్రీఅరబిందో సొసైటీ కార్యాలయం నుంచి 15 మంది సభ్యులతో కూడిన జట్టు వరంగల్-హైదరాబాద్ మధ్య 150 కిలోమీటర్లు ఈ రన్ చేపట్టారు. శ్రీ అరబిందో 150వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు సొసైటీ చైర్మన్ వరిగొండ కాంతారావు తెలిపారు.
హైదరాబాద్‌కు చెందిన ఫిట్నెస్ ట్రైనర్ సామ జగన్మోహన్రెడ్డి ఈ రన్ టీంలో పాల్గొంటున్నట్టు పేర్కొన్నారు. హైదరాబాద్ రిలీఫ్ రైడర్స్ సభ్యుడు రవి సాంబారి సైకిల్‌పై వారితోపాటు రానున్నట్టు నిర్వాహకులు తెలిపారు. శనివారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఈ రన్ ఆదివారం ఉదయం 8 గంటలకు హైదరాబాద్‌లోని అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్‌కు చేరుకుంటుందని వెల్లడించారు. కార్యక్రమంలో చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ గుర్రపు దామోదర్, కేర్ కాలేజీ ఆఫ్ ఫార్మసీ డైరెక్టర్ సుధీర్, తుషార గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ మురళీధర్, అరబిందో సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

