వరంగల్, జులై 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వరంగల్‌కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత సూక్ష్మశిల్పి అజయ్‌కుమార్ రూ పొందించిన సూక్ష్మకళాఖండాలు అంతరిక్షంలో విహరించనున్నాయి. సూది బెజ్జంలో చెకిన ఈ సూక్ష్మ కళాఖండంలో దేశం గర్వించదగిన శాస్త్రవేత్తలు సీవీరామన్, విక్రమ్‌సారాభాయ్, ఏపీజే అబ్దుల్‌కలాం ప్రతిరూపాలు ఉన్నాయి.
అంతరిక్ష ప్రయాణానికి అనువుగా ఉండేలా స్టెయిన్లెస్ స్టీల్, 24 క్యారెట్ల బంగారం, వెండి, సిరామిక్, కార్బన్ ఫైబర్ వంటి ప్రత్యేక పదార్థాలను ఉపయోగించి వీటిని రూపొందించారు. ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకు అంతరిక్షంలోకి పంపిన కళాఖండాల్లో మూన్ మ్యూజియం (1969), ఫాలెన్ అస్ట్రోనాట్ (1971) వంటి కళాఖండాలు విశేష గుర్తింపు పొందాయి. ఇప్పుడు వాటి సరసన భారత్ నుంచి అజయ్‌కుమార్ రూపొందించిన ఈ సూక్ష్మశిల్పాలకు చోటుదక్కడం విశేషం.