ఇటిక్యాల, ఏప్రిల్ 26 : లారీని ఓల్వో బస్సు ఢీకొట్టిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం మునుగాల శివారులోని ఎన్హెచ్-44పై ఆదివారం చోటుచేసుకున్నది. ఇటిక్యాల ఎస్సై రవి కథనం ప్రకారం.. పీలేరు నుంచి హైదరాబాద్కు బయలుదేరిన సీఎంఆర్ ట్రావెల్స్కి చెందిన వోల్వో బస్సు డ్రైవర్ సుబ్రహ్మణ్యం వేగంగా నడుపుతూ కోదండాపురం దాటిన తర్వాత మామిడితోట పరిసరాల్లో ముందు వెళ్తున్న లారీని వెనుకనుంచి ఢీకొట్టాడు.
ఈ ప్రమాదంలో అంజలి , శిరీషకు తీవ్రగాయాలుకాగా మిగతా ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు గాయపడిన వారిని కర్నూల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అంజలి భర్త మల్లకుంట్ల నాగరాజు ఫిర్యాదు మేరకు కేసునమోదుచేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై తెలిపారు.