హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): వొకేషనల్ కోర్సుల్లో బ్యాక్‌లాగ్స్ విద్యార్థులకు ఇంటర్‌బోర్డు మరో చక్కటి అవకాశం ఇచ్చింది. వీరికి పాత విధానంలో పరీక్షలు రాసుకొనేలా వెసులుబాటు కల్పించింది. 2011 -12 సంవత్సరంలో వొకేషనల్ కోర్సుల పరీక్షావిధానాన్ని బోర్డు మార్చింది. ఇంగ్లిష్, జనరల్ ఫౌండేషన్ కోర్సులకు 75 మార్కులుండగా, 50కి కుదించింది. ఆన్ జాబ్ ట్రైనింగ్ (వోజేటీ) 75 మార్కులుండగా, 100 మార్కులకు పెంచింది. 2011 -12 ముందు ఫెయిలైనవారు తమకు పాత విధానంలో పరీక్షలు నిర్వహించాలని విజ్ఞప్తి చేయగా, ఇంటర్‌బోర్డు తాజా చివరి అవకాశం ఇచ్చింది. 2024 -25 విద్యాసంవత్సరం నుంచి ఫెయిలైన వారు కొత్త పరీక్షా విధానంలోనే పరీక్షలు రాయాల్సి ఉంటున్నదని బోర్డు కార్యదర్శి నవీన్‌మిట్టల్ స్పష్టంచేశారు.