హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తేతెలంగాణ): కస్తూర్బా, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ టీఎస్ యూటీఎఫ్ అధ్యక్షురాలిగా సంగారెడ్డి జిల్లా కు చెందిన విశాలక్షి, ప్రధాన కార్యదర్శిగా యాదాద్రి భువనగిరికి చెందిన సీహెచ్ లక్ష్మి ఎన్నికయ్యారు. గురువారం హైదరాబాద్లోని యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కోశాధికారిగా మంజుల(మహబూబాబాద్), ఉపాధ్యక్షులుగా గోపీలత, మీనా, సూర్యకిరణ్, రేణుక, రాజకుమారి, టీనా, నారాయణమ్మ, గంగమణి, కార్యదర్శులుగా సుమన చైతన్య, శ్రీలత, స్వరూప, కిష్టయ్య, రాజాబాయి, సంధ్య, సావిత్రి, కుమారస్వామి, శోభారాణిని ఎన్నుకున్నా రు. నూతన కార్యవర్గాన్ని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జంగయ్య, రవి అభినందించారు.