హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ) : తిరుమలలో జూన్ 30 వరకు శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించేందుకు వీలుగా బ్రేక్ దర్శనం రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. వీఐపీ బ్రేక్ దర్శనానికి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని, భక్తులు గమనించి సహకరించాలని కోరారు. శుక్రవారం 3 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలోఉన్నారు. శ్రీవారి దర్శనానికి 20 గంటలకుపైగా సమయం పట్టింది.