హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ తకెళ్లపల్లి రవీందర్రావు, ఐక్యరాజ్యసమితిలో పనిచేసిన అంతర్జాతీయ జల విధాన నిపుణుడు డాక్టర్ భిక్షం గుజ్జాతో కలిసి తూర్పు ఆఫ్రికా దేశాలైన టాంజానియా, ఉగాండా, కెన్యాలో పర్యటిస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న తూర్పు ఆఫ్రికా దేశాల తాజా పరిస్థితి, వాస్తవాలను తెలుసుకునేందుకు వారు పాఠశాలలు, వ్యవసాయక్షేత్రాలు, జాతీయ ఉద్యానవనాలను సందర్శించారు. వివిధ అంశాలపై ఉపాధ్యాయులు, స్థానికులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. నైలు నది పరీవాహక ప్రాంతాన్ని అక్కడి గైడ్స్‌తో కలిసి పర్యటిస్తున్నారు. ఈ నెల 14న ఉగాండాకు వెళ్లిన ఈ ముగ్గురి బృందం.. 18న కెన్యాకు వెళ్లనున్నది. 22న తిరిగి ఇండియాకు రానున్నారు.
18న వేణుగోపాల్ రాక
హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈనెల 18న హైదరాబాద్‌కు రానున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పాలనా తీరుతెన్నులను పరిశీలించటంతోపాటు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలతో ఆయన సమావేశం కానున్నట్టు తెలిసింది. ఖాళీగా ఉన్న కార్పొరేషన్ల చైర్మన్ పదవులు ఆశిస్తున్న వారితో కూడా ఆయన ప్రత్యేకంగా సమావేశం కానున్నట్టు సమాచారం.