అబ్దుల్లాపూర్మెట్, జూలై 28: రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, వరదల కారణంగా ప్రజలు కష్టాలు పడుతున్న సమయంలో.. భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ రాజకీయ ప్రయోజనాలు ఆశించి శుక్రవారం లష్కర్గూడ గ్రామ పర్యటనకు వచ్చారు. దీన్ని నిరసిస్తూ గ్రామస్థులు, బీఆర్ఎస్ నాయకులు.. ‘ఎంపీగా ఉన్న సమయంలో లష్కర్గూడ గ్రామాన్ని పట్టించుకోని బూర నర్సయ్యగౌడ్ గో బ్యాక్’ అంటూ ఆయనను అడ్డుకున్నారు. ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు ఇరువురిని సముదాయించారు.