బషీరాబాద్, నవంబర్ 26 : రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సం దర్భంగా ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పనుల జాతరలో ప్రజలు సమస్యలపై ఏకరువు పెట్టారు. మంగళవారం వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలోని మంతట్టి గ్రా మంలో గ్రామీణాభివృద్ధిశాఖ, ఉపాధిహామీ పథకం అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే బుయ్య ని మనోహర్‌రెడ్డి హాజరై వివిధ పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశా రు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడుతుండగా ప్రజలు పలు సమస్యలపై ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పాటు అయ్యి ఏడాది కావొస్తున్నా ఇప్పటి వరకు పింఛన్లు, మహిళలకు రూ. 2500, రుణమాఫీ, రైతు బంధుకు దిక్కు లేదన్నారు. హామీలు నెరవేర్చకుండా విజయోత్సవాల పేరిట హడావుడి ఎందుకని ప్రశ్నించారు. మా యాతన పట్టించుకోకుండా.. జాతరలు ఎందుకు నిలదీశారు. దీంతో ఓ నాయకుడు మాట్లాడుతూ మీరు ఇలా చేస్తే మీకు ఏమి రావు, వేరే గ్రామానికి వెళ్లిపోతాయని బెదిరింపు ధోరణిలో మా ట్లాడడంతో ప్రజల్లో ఆగ్రహం పెరిగింది. దీంతో పోలీసులు బలవంతంగా ప్రశ్నిస్తున్నవారిని బయటకు తరలించారు. కాంగ్రె స్ నేతల వైఖరి, పోలీసుల ధోరణిపై గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు.